జిల్లా స్థాయి పోటీలకు చల్‌గల్ విద్యార్థుల ఎంపిక
NEWS Sep 16,2025 12:41 pm
జగిత్యాల రూరల్ మండల స్థాయిలో జరిగిన క్రీడా పోటీల్లో చల్‌గల్ జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. పొలస ZPHSలో ఈ నెల 9, 10 తేదీల్లో నిర్వహించిన కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ పోటీల్లో 29 మంది విద్యార్థులు ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి ఎసీఎఫ్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల పీడీ వెంకటలక్ష్మి తెలిపారు. ఎంపికైన విద్యార్థులను, పీడీ వెంకటలక్ష్మిని ప్రధానోపాధ్యాయురాలు లతాదేవి అభినందించారు.