ఘనంగా ఇంజనీర్స్ డే వేడుకలు
NEWS Sep 15,2025 08:12 pm
కోరుట్ల పట్టణంలోని ఓ హోటల్ లో నిర్వహించిన ఇంజనీర్స్ డేని ఇంజనీర్లు అందరూ ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ డే గురించి వారు మాట్లాడుతూ ఏటా సెప్టెంబర్ 15న భారతదేశం జాతీయ ఇంజనీర్ల దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ప్రముఖ సివిల్ ఇంజనీర్,భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తారని చెప్పారు. ఇంజనీరింగ్ డే విశేషాలు ఇంజినీర్లు దేశాభివృద్ధికి వెన్నెముకల్లా ఉండి, మౌలిక సదుపాయాలు, భవనాలు, డ్యామ్లు, బ్రిడ్జీలు, కంప్యూటర్లు, ఇతర ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలకు ఆద్యులు అవుతున్నారనీ అన్నారు. ఈ కార్యక్రమంలో భార్గవి శర్మ, మహ్మద్ ఇర్ఫాన్, మహ్మద్ నసీర్, మహ్మద్ ఇర్ఫాన్ పాల్గొన్నారు.