ఎస్పీ కార్యాలయంలో గ్రీవెన్స్ డే
NEWS Sep 15,2025 08:40 pm
జగిత్యాల జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డేలో 12 మంది అర్జీదారులు తమ సమస్యలను వినిపించారు. ఎస్పీ అశోక్ కుమార్ స్వయంగా ప్రతి ఒక్కరిని కలుసుకొని వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, ఫిర్యాదులపై పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ఎస్పీ మాట్లాడుతూ – “గ్రీవెన్స్ డే లో వచ్చే ప్రతి ఫిర్యాదును సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కారం చూపిస్తున్నాం. బాధితుల ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో పొందుపరిచి, వాటిని నిత్యం పర్యవేక్షిస్తున్నాం” అని తెలిపారు.