జగిత్యాల: పందులు స్వైర విహారం
NEWS Sep 15,2025 06:03 pm
జగిత్యాల మున్సిపల్ పరిధిలో విద్యానగర్ లో పందులు స్వైర విహారం చేస్తున్నాయి. నిత్యం పందులు సందుల్లో రోడ్లపై తిరుగాడుతున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు పందులు రోడ్లపై, జన నివాసాల చుట్టూ సంచరిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. పరిసరాలను ఆశుభ్రపరుస్తున్నాయి. వీటి చేష్టలతో స్థానికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. అసలే వర్షాలు పడుతున్న ఈ తరుణంలో పందుల సంచారం వల్ల పలు వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పందుల సంచారం కారణంగా పిల్లలకు మెదడువాపు వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.