సీనియర్ జర్నలిస్టుకు ఆర్థిక సహాయం
NEWS Sep 15,2025 05:52 pm
సీనియర్ జర్నలిస్ట్ గోరుమంతల నారాయణను పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందించారు టియూడబ్ల్యూజే (ఐజేయు) మెట్ పల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా సభ్యులు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు బూరం సంజీవ్, మహమ్మద్ అజీమ్ మాట్లాడుతూ.. కోరుట్ల సూర్య రిపోర్టర్ గోరుమంతల నారాయణ 2 నెలల క్రితం అనారోగ్యానికి గురికాగా ఆయనకు డాక్టర్ లు సర్జరీ చేసి ఒక కాలు తొలగించారని తెలిపారు. మెట్ పల్లి ప్రెస్ క్లబ్ సభ్యులం ఆయనకు ఆర్థిక సహాయాన్ని అందించమన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులతో పాటు ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.