నమ్ముకున్నోళ్లను అమ్ముకున్నారు
NEWS Sep 15,2025 05:19 pm
మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఏకి పారేశారు. నమ్ముకుని ఓట్లు వేసిన ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. అవకాశం ఇచ్చిన పార్టీని, నమ్మి గెలిపించిన వారి చెవుల్లో పూలు పెట్టారంటూ మండిపడ్డారు. తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం నమ్ముకున్న వాళ్లను నట్టేట ముంచారంటూ ఫైర్ అయ్యారు. ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు తప్పించు కుందామని ప్రయత్నం చేస్తున్నారని, ఇప్పటికైనా తప్పు చేశామని ఒప్పు కోవాలన్నారు.