'పీఏసీఎస్ పదవీకాలం పొడిగించాలి'
NEWS Sep 15,2025 05:59 pm
జగిత్యాల: జిల్లాలోని 23 పాక్స్ (PACS) సొసైటీల బోర్డుల పదవీకాలం ముగిసిన సందర్భంలో, కొత్త ఎన్నికలు జరిగే వరకు ప్రస్తుతం ఉన్న చైర్మన్‌లు, డైరెక్టర్లను కొనసాగించాలంటూ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందించారు బీఆర్ఏస్ జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు. పాక్స్ సొసైటీలు గ్రామీణ రైతులకు జీవనాడి వంటివని ఇవి లేకుండా రైతులు రుణాలు పొందడం, విత్తనాలు-ఎరువులు అందుకోవడం, పంటల కొనుగోలు జరగడం కష్టసాధ్యమని చెప్పారు. మాజీ జడ్పీ చైర్మన్ దావా వసంత, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్, సొసైటీల చైర్మన్లు, డైరెక్టర్లు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.