తహసీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి
NEWS Sep 15,2025 10:44 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం తహసీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతోందని తహసీల్దార్ గోపాల కృష్ణ తెలిపారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ప్రజావాణి ద్వారా వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖాధికారులకు అందజేస్తామని చెప్పారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఎంపీడీవో సునీల్ కుమార్, వెటర్నరీ డాక్టర్ ఉజ్వల, జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు శృతి, పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు సత్యవతి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.