ప్రాథమిక పాఠశాలల్లో నాణ్యమైన విద్య
NEWS Sep 15,2025 06:05 pm
ప్రాథమిక పాఠశాలల్లో నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. అశ్వాపురం మండలం మల్లెల మడుగు గ్రామ పంచాయతీలో ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో మొక్కలు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.