తెలంగాణలో గాడి తప్పిన పాలన : బండి
NEWS Sep 15,2025 02:59 pm
రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడి తప్పిందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పాలకులపై ప్రజలకు విశ్వాసం పోయిందన్నారు. ఎన్నికల ముందు రాజకీయ నాయకులంతా లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెబుతారని, కానీ ఆచరణలో వేరే పరిస్థితి ఉంటుందన్నారు. కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చాక మార్పు తీసుకొచ్చారని తెలిపారు. ఒకే ఏడాదిలో 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మోడీ సర్కార్‌దేనని పేర్కొన్నారు. ఎక్కడా పేపర్ లీక్ కాలేదు, ఏ పరీక్షలు రద్దు కాలేదన్నారు. పైరవీలకు అవకాశం ఇవ్వ లేదన్నారు.