యూరియా వాడకం తగ్గిస్తే ప్రోత్సాహకం
NEWS Sep 15,2025 02:29 pm
యూరియా వాడకం తగ్గించడంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రైతులు వచ్చే ఏడాది నుంచి యూరియా వాడకాన్ని తగ్గిస్తే, ఆ మేరకు ప్రోత్సాహం ఇస్తాం అన్నారు. ప్రస్తుతం వాడుతున్న యూరియాను తగ్గించే ప్రతి కట్టకు రూ. 800 నేరుగా రైతులకు అందజేస్తాం అని చెప్పారు. మన రైతులు ఎక్కువ ఎరువులు వాడుతున్నారని, దాని వల్ల మిరపను చైనా నుంచి తిప్పి పంపారని తెలిపారు. కొన్ని యూరప్ దేశాలు కూడా మన ఉత్పత్తుల ధరలను తగ్గిస్తున్నాయని పేర్కొన్నారు.