భయాందోళనలో వర్షకొండ గ్రామ ప్రజలు
NEWS Sep 15,2025 05:54 pm
ఇబ్రహీంపట్నం: వర్షకొండ గ్రామంలో వీధి కుక్కలు స్వైర విహారం చేయడంతో గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వీధిలో కుక్కలు ఎక్కువ అవ్వడంతో పిల్లలను పాఠశాలకు తల్లిదండ్రులు స్వయంగా తీసుకెళ్తున్నారు. ప్రజలు ఒంటరిగా వీధుల్లోకి , తోటల్లోకి వెళ్లడానికి భయపడుతున్నారు. ఎవరికి ఎలాంటి సమస్య రాకముందే మునిసిపల్ అధికారులను తక్షణ జాగ్రత్త చర్యలు చేపట్టాలని వర్షకొండ గ్రామం ఏవైఎస్ యూత్ సభ్యులు కోరుతున్నారు.