గోధుర్ గ్రామ ఆలయానికి ఎంపీ నిధులు
NEWS Sep 15,2025 05:55 pm
ఇబ్రహీంపట్నం: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నిధుల నుంచి గోధూర్ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి రూ.2 లక్షల ప్రొసీడింగ్ పత్రన్ని జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు ఆలయం కమిటీ కి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి శ్రీనివాసన్, మండల జిల్లా అధ్యక్షుడు బాయి లింగారెడ్డి, నాయకులు తెగేలా శ్రీధర్ రెడ్డి, బండి గోపాల్ మండల ప్రధాన కార్యదర్శులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.