ఏపీలో మరో నాలుగు రోజులు వర్షాలు
NEWS Sep 15,2025 10:43 am
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేసింది. అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అల్లూరి, కాకినాడ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.