భారత్ దెబ్బ పాకిస్తాన్ అబ్బా
NEWS Sep 15,2025 07:50 am
దుబాయ్ వేదికగా ఆసియా కప్ లీగ్ మ్యాచ్ లో దాయాది పాకిస్తాన్ జట్టుకు చుక్కలు చూపించింది భారత జట్టు. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 రన్స్ చేసింది. కుల్దీప్ యాదవ్ మరోసారి చక్రం తిప్పాడు. బుమ్రా ఆఖరులో మెరిశాడు. అనంతరం బరిలోకి దిగిన టీమిండియా 3 వికెట్లు కోల్పోయి పని పూర్తి చేసింది. సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ సూపర్ షో చేశారు. ఇండియా విక్టరీ సాధించడంతో దేశ వ్యాప్తంగా సంబురాలు మిన్నంటాయి.