మహిళా సాధికారతతోనే పురోభివృద్ది సాధ్యం
NEWS Sep 15,2025 07:45 am
మహిళా సాధికారత దేశాభివృద్దికి కీలకమని స్పష్టం చేశారు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా. తిరుపతిలో జరిగిన మహిళా ప్రజా ప్రతినిధుల సాధికారత సభలో పాల్గొన్నారు. గతంలో కంటే ఇప్పుడు మహిళల ప్రాతినిధ్యం పెరిగిందన్నారు. వ్యాపార, వాణిజ్య, టెక్నాలజీ, ఆరోగ్య, నిర్మాణ, క్రీడా, తదితర రంగాలలో అద్భుతంగా రాణిస్తున్నారని ప్రశంసలు కురిపించారు. రాజకీయ రంగంలో కూడా మరింతగా రాణించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు స్పీకర్.