కుంటను పరిశీలించిన జీవన్ రెడ్డి
NEWS Sep 14,2025 11:18 pm
రాయికల్: పట్టణ కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్దనున్న కుంటను మాజీ మంత్రి జీవన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “నిధులు సమస్య కాదు. అంబేడ్కర్ విగ్రహం సమీపంలోని కుంట సుందరీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలి” అని అన్నారు. కుంట చుట్టూ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని సంబంధిత అధికారులతో ఫోన్‌లో ఆదేశించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు స్థానిక నేతలు పాల్గొన్నారు.