7 లక్షలు కొట్టేసిన సైబర్ మోసగాళ్లు
NEWS Sep 14,2025 11:21 pm
సదాశివనగర్ (కామారెడ్డి): సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొలిప్యాక శ్రీనివాస్ ఇటీవల సైబర్ మోసగాళ్లకు బలై 7 లక్షల రూపాయలు కోల్పోయారు. వాట్సాప్‌లో వచ్చిన ఒక సందేశాన్ని ఓపెన్ చేయగానే డబ్బులు డెబిట్ అయినట్లు తెలిపారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ అప్పటికే 7 లక్షలు మాయం అయ్యాయని ఆయన వేదన వ్యక్తం చేశారు. 1 లక్ష రూపాయలు మాత్రం ఫ్రీజ్ చేయబడినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయంపై మాజీ జడ్పిటిసి రాజేశ్వరరావు పరామర్శించి, ధైర్యం కోల్పోవద్దని సూచించారు. వ్యాపారవేత్తలు బోరింగ్ రామ్ రెడ్డి, నర్సారెడ్డి, అశోక్ రెడ్డి కూడా ఈ సందర్భంగా హాజరయ్యారు.