మల్యాల: నిలిచిన వర్షపు నీటితో ఇక్కట్లు
NEWS Sep 15,2025 12:24 am
మల్యాల మండలం కొండగట్టులోని జగిత్యాల- కరీంనగర్ ప్రధాన రహదారిపై చిన్న వర్షానికే నీరు నిలుస్తోంది. ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామస్థులు దీనిని తీవ్రమైన సమస్యగా పేర్కొంటున్నారు. వర్షాలు ఎక్కువగా కురిసే సమయంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు మీద నీరు నిలవకుండా అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.