'నూతన వంతెన మంజూరుకు కృషి'
NEWS Sep 15,2025 06:01 pm
రాయికల్ మండలంలోని మైతాపూర్- కోరుట్ల రహదారిలో తాళ్లకుంట ఒర్రెపై ఉన్న లో లెవెల్ వంతెనను మాజీమంత్రి టీ.జీవన్ రెడ్డి పరిశీలించారు. చిన్న వర్షానికే వంతెన మునిగి సమీపంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోకి నీరు చేరుతుందని, దీంతో కాలనీవాసులు, విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని స్థానిక నాయకులు మాజీమంత్రికి తెలిపారు. స్పందించిన మాజీమంత్రి R&B శాఖ ద్వారా నూతన వంతెన మంజూరుకు కృషి చేస్తానన్నారు.