పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు కాంగ్రెస్ మద్దతు
NEWS Sep 14,2025 03:57 pm
ప్రధాని నరేంద్ర మోదీ అస్సాంలో జరిగిన ర్యాలీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న సైన్యాన్ని అభినందించకపోగా, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు, దేశంలో అక్రమ చొరబాటుదారులకు మద్దతు పలికారంటూ కాంగ్రెసుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అలాంటి పార్టీని, నేతలను 143 కోట్ల భారతీయులు ఎప్పటికీ క్షమించరని మోదీ స్పష్టం చేశారు.