ప్రసాద్ శర్మకు జ్యోతిష్యరత్న అవార్డు
NEWS Sep 14,2025 08:50 pm
హైదరాబాద్‌లోని విశ్వ జ్యోతి జ్యోతిష్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో జ్యోతిష్య, వాస్తు విభాగాలలో సేవలందించిన వారికి సత్కారాలు అందజేశారు. ఇందులో భాగంగా మెట్‌పల్లి శ్రీ గురుదత్త బ్రాహ్మణ యువజన సేవా సంఘం అధ్యక్షులు బ్రహ్మశ్రీ డి.ఎస్.కే. ప్రసాద్ శర్మ (బండలింగాపూర్), కోశాధికారి బ్రహ్మశ్రీ మునుగోటి రవికుమార్ శర్మ (ఆత్మకూర్)లను ‘జ్యోతిష్యరత్న’ బిరుదుతో సత్కరించారు. ఈ సందర్భంగా బిరుదులు అందుకున్న వారిని పలువురు అభినందించారు.