11వ వార్డులో డ్రైనేజీ సమస్య తీవ్రత
NEWS Sep 14,2025 08:49 pm
మెట్‌పల్లి పట్టణంలోని 11వ వార్డులో డ్రైనేజీ సౌకర్యం లేక రోడ్లపై మురికి నీరు చేరి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న హోటల్ నుంచి వచ్చే మురికి నీటితో పరిస్థితి మరింత దయనీయంగా మారిందని స్థానికులు తెలిపారు. పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో పాటు వ్యాధులు ప్రబలుతున్నాయని, సమస్యపై మున్సిపల్ సిబ్బందికి ఎన్నిసార్లు తెలియజేసినా స్పందన లభించలేదని, ఇకనైనా అధికారులు చర్యలు తీసుకొని సమస్యల నుంచి విముక్తి కల్పించాలని వారు కోరుతున్నారు.