జగిత్యాలలో రక్తదానం శిబిరం ప్రారంభం
NEWS Sep 14,2025 08:53 pm
మల్యాల: రక్తదానం ద్వారా మరొకరి ప్రాణాన్ని కాపాడగలమని, రక్తదానం చేయడం ప్రాణదానంతో సమానమని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ నీలారపు శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఐఎంఏ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. సమాజంలో రక్తదానం పై అవగాహన పెరగాలని, అందుకోసం ఐఎంఏ తరహా సంస్థలు ఇలాంటి కార్యక్రమాలను మరింతగా నిర్వహించాలని ఆయన కోరారు. సీజనల్ వ్యాధుల సమయంలో వచ్చే జ్వరాలతో చాలామంది రక్తకణాల కోసం ఇబ్బందులు పడుతారని, అలాంటి సందర్భాల్లో రక్తదానం ఎంతో ఉపయుక్తమని డాక్టర్ నీలారపు శ్రీనివాస్ తెలిపారు.