గణనాథా మమ్ముల్ని మన్నించు..!
NEWS Sep 14,2025 08:51 pm
జగిత్యాల పట్టణంలోని ధర్మారం రోడ్డులోని కాలువలో గణనాథుడి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. అయితే నిమజ్జనం కోసం అధికారులు ప్రత్యేకంగా చింతకుంట చెరువును ఏర్పాటు చేసినప్పటికీ, కొందరు పట్టించుకోకుండా కాలువలోనే విగ్రహాన్ని వేశారు. దీంతో అది పూర్తిగా మునగకపోగా, విగ్రహం చుట్టుపక్కల పందులు స్వైర విహారం చేస్తున్నాయి. ఈ దృశ్యం చూసిన భక్తులు "గణనాథా, మన్నించు" అని ప్రార్థిస్తున్నారు.