పెత్తరమాస (పెద్దల అమావాస్య) ప్రారంభం
NEWS Sep 14,2025 08:54 pm
జగిత్యాల వ్యాప్తంగా పెత్తరమాస (పెద్దల అమావాస్య) గత ఆదివారం నుంచి ప్రారంభమైంది. తండ్రి, తాత, ముత్తాతలను స్మరించుకుంటూ పుత్రులు నిర్వహించే ఈ కార్యక్రమానికి గ్రామాల్లో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఈ అమావాస్య రోజున పితృదేవతలు ఇంటి ద్వారం వద్ద నిలబడతారని ప్రజల నమ్మకం. శ్రాద్ధకర్మలు నిర్వహించడం ద్వారా పితృదేవతల దీవెనలు తరతరాలకు లభిస్తాయని విశ్వాసం. పెత్తరమాస అనంతరం విజయదశమి వేడుకలు ప్రారంభమవుతాయని పండితులు, శాస్త్రాలు పేర్కొంటున్నాయి.