నాచుపల్లి పద్మనాయక వెలమ సంక్షేమ మండలి కొత్త కార్యవర్గం ఎన్నిక
NEWS Sep 14,2025 08:55 pm
జగిత్యాల: కొడిమ్యాల మండలంలోని నాచుపల్లి పద్మనాయక వెలమ సంక్షేమ మండలి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సురభి ప్రభాకర్ రావు, ఉపాధ్యక్షుడిగా కలకుంట్ల సుగుణాకర్ రావు, ప్రధాన కార్యదర్శిగా గండ్ర ప్రమోద్ రావు, కార్యదర్శిగా గండ్ర నర్సింగ రావు, కోశాధికారిగా సురభి వేణు రావు ఎన్నికయ్యారు. సభ్యులుగా రాసమడుగు లక్ష్మణ్, తాల్లపెళ్లి వెంకట్, రాసమడుగు సుమన్, బోయినపెల్లి సాగర్, పైడిపెల్లి తిరుపతి ఎంపికయ్యారు.