మల్యాల: 229 మందికి వైద్య సేవలు
NEWS Sep 14,2025 08:56 pm
మల్యాల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో ఐఎంఏ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామంలోని సుమారు 229 మంది ఈ వైద్య సేవలను వినియోగించుకున్నారు. ఈ శిబిరంలో చర్మవ్యాధులు, దంత సమస్యలు, చెవి–ముక్కు–గొంతు వ్యాధులను నిర్ధారించారు. అవసరమైన వారికి తగిన చికిత్స అందించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్యులు హేమంత్, శ్రీనివాస్, సుధీర్, శ్రావణ్ సేవలు అందించారు.