జగిత్యాల రౌడీషీటర్‌పై పీడీ యాక్ట్
NEWS Sep 14,2025 05:54 pm
జగిత్యాల జిల్లా శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ స్పష్టం చేశారు. విద్యానగర్‌కు చెందిన రౌడీషీటర్ బండి తరాల శ్రీకాంత్ ఇప్పటివరకు సుమారు 20 కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు వెల్లడించారు. ప్రజా శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తున్నందున అతనిపై పీడీ యాక్ట్ అమలు చేసినట్టు ఎస్పీ తెలిపారు. ఈ క్రమంలో టౌన్ సీఐ కరుణాకర్ శనివారం కరీంనగర్ జైలులో నిందితుడికి పీడీ ఉత్తర్వులను అందజేశారు.