గురుకుల డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు
NEWS Sep 14,2025 05:56 pm
జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ శివారులోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో 2025–26 విద్యాసంవత్సరానికి మిగిలిన ఎస్సీ సీట్లను స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేస్తున్నట్లు ప్రిన్సిపల్ గునుక శ్రీలత తెలిపారు. ఈ నెల 15, 16, 18, 19 తేదీలలో అర్హత కలిగిన ఎస్సీ విద్యార్థినులు కళాశాలను సంప్రదించి అడ్మిషన్లు పొందవచ్చని సూచించారు. విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.