అంతర పంటల సాగుతో అదనపు లాభాలు
NEWS Sep 14,2025 12:31 pm
జగిత్యాల జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఎక్కువగా రైతులు అంతర పంటలు సాగు చేస్తూ అదనపు లాభాలను గడిస్తున్నారు. అంతర పంటల సాగు వల్ల ఒకేసారి వివిధ రకాల పంటలను సాగు చేస్తూ రైతులు అదనపు ప్రయోజనాలు పొందుతున్నారు. పసుపులో మొక్కజొన్న, కంది, మిర్చి, మామిడి తోటల్లో వరి, మొక్కజొన్న, వేరుశనగ, పత్తి వంటి పలు రకాల పంటలు సాగు చేస్తూ రైతులు అదనపు ప్రయోజనాలు పొందుతూ, లాభాలు గడిస్తున్నారు.