నవదుర్గ పీఠం ఉత్సవాలకు MLAకు ఆహ్వానం
NEWS Sep 14,2025 06:14 pm
జగిత్యాల: గోవింద్‌పల్లి నవదుర్గ పీఠక్షేత్రంలో దుర్గ శరన్నవరాత్రి ఉత్సవాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నట్లు నవదుర్గ సేవా సమితి ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఆదివారం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా సమితి సభ్యులు ఉత్సవాల నిర్వహణలో విశేష ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో నవదుర్గ సేవా సమితి ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.