'అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి'
NEWS Sep 14,2025 06:12 pm
జగిత్యాల: అంబేడ్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ సభ్యులు పిలుపునిచ్చారు. జగిత్యాల పట్టణంలోని తహశీల్ చౌరస్తాలో ఆదివారం అంబేడ్కర్ నామస్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నాయకులతో కలిసి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను స్మరించుకొని, సమాజ అభ్యున్నతికి అందరూ అంబేడ్కర్ చూపిన మార్గంలో నడవాలని ఆకాంక్షించారు.