అర్బన్ హౌసింగ్ కాలనీలో నెట్వర్క్ సమస్య
NEWS Sep 14,2025 06:09 pm
జగిత్యాల: పట్టణంలోని నూకపెల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలో నివసిస్తున్న ప్రజలు మొబైల్ నెట్వర్క్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిరుపేదలకు కేటాయించిన ఈ కాలనీలో 4 వేలకుపైగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఉండగా, నెట్వర్క్ లేమితో రోజువారీ పనుల్లో అంతరాయం కలుగుతోంది. అత్యవసర సేవలకు సైతం మొబైల్ సిగ్నల్ లేకపోవడంతో నివాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు.