జగిత్యాలలో RTC కార్గో పెండింగ్ పార్సిళ్ల వేలం
NEWS Sep 14,2025 06:05 pm
జగిత్యాల: స్థానిక బస్టాండ్‌లోని TGS RTC Logistics (కార్గో) కేంద్రంలో 40 రోజులకుపైగా వినియోగదారులు తీసుకెళ్లని పెండింగ్ పార్సిళ్లను ఈనెల 17వ తేదీ (బుధవారం) వేలం వేయనున్నట్లు RTC డివిజనల్ మేనేజర్ కల్పనా ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు లాజిస్టిక్స్ కేంద్రంలో ఈ వేలం నిర్వహించనున్నారు. ఆసక్తి గల వారు సమయానికి హాజరై వేలంలో పాల్గొనవచ్చని ఆమె సూచించారు.