ఎమ్మెల్యేలపై స్పీకర్ షాకింగ్ కామెంట్స్
NEWS Sep 14,2025 05:06 pm
ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. చిరు ఉద్యోగులు ఉద్యోగానికి రాకపోతే జీతం కట్ చేస్తున్నాం. మరి మన ఎమ్మెల్యేలకి అది వర్తించదా అని ప్రశ్నించారు. ప్రజలు ఎమ్మెల్యేలని చేస్తే, అసెంబ్లీకి రాక పోతే ఎలా అని నిలదీశారు. ప్రజా సమస్యలు చర్చించక పోతే వారిపై చర్యలు ఎందుకు తీసుకోకూడదని అన్నారు. ఈ విషయంలో లోక్ సభ స్పీకర్ ఇలాంటి వారిని ఏమి చేయాలో ఆలోచన చేయాలన్నారు.