శ్రీవారి సన్నిధిలో హోం మంత్రి
NEWS Sep 14,2025 05:01 pm
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలకు మరింత మెరుగైన సంక్షేమం, అభివృద్ధిని అందించే శక్తిని కూటమి ప్రభుత్వానికి అందించాలని ఆ భగవంతుడిని కోరుకున్నానని తెలిపారు. వేద పండితుల ఆశీర్వాదాలు, స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరించడం మనసుకు ఎనలేని సంతృప్తిని, ప్రశాంతతను కలిగించాయని పేర్కొన్నారు.