బీజేపీకి సిద్దాంతం..కేడర్ బలం
NEWS Sep 14,2025 04:33 pm
కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోడీ అధికారంలోకి రాక ముందు ప్రజా వ్యతిరేక ప్రభుత్వం నడిచేదన్నారు. ఏపీ రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వాన్ని కూలదోసి కూటమి ప్రభుత్వాన్ని ఎంచుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. మిగతా పార్టీలు ఏ ఎండకు ఆ గొడుగు పడతాయన్నారు. బీజేపీ సిద్ధాంతం మీద, కేడర్ మీద ఆధార పడుతుందన్నారు.