బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అనిత సమీక్ష
NEWS Sep 14,2025 01:55 pm
తిరుమల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలలో టీటీడీ, పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి వంగలపూడి అనిత. బహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల కోసం ఏర్పాట్లు, భద్రతా చర్యలపై అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చారు. సెప్టెంబర్ 24 నుంచి జరగబోయే బ్రహ్మోత్సవాలను ఘనంగా లోటు పాట్లు లేకుండా నిర్వహించాలని స్పష్టం చేశారు హోం మంత్రి.