మచిలీపట్నంలో విజయవాడ ఉత్సవ్
NEWS Sep 14,2025 12:29 pm
ఎంపీ కేశినేని చిన్ని కీలక ప్రకటన చేశారు. మచిలీపట్నంలో విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గొడుగుపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానం భూముల్లో వేడుకలు చేపడతామన్నారు. ఆలయానికి రికార్డు స్థాయిలో రూ.45 లక్షల లీజు ఆదాయం వస్తుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దేవస్థానం భూములు అన్యాక్రాంతం కావన్నారు. ఈ భూములు ఎవరికీ బదలాయింపు జరగడం లేదన్నారు. కేవలం విజయవాడ ఉత్సవ్ నిర్వహణకే 56 రోజుల లీజుకు ఇచ్చామన్నారు. కొందరు కావాలని చేసే దుష్ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు.