బుచ్చయ్యపేట మండలంలో వర్షాల విజృంభణ
NEWS Sep 14,2025 04:26 pm
బుచ్చయ్యపేట మండలంలో వర్షాలు ఆగడంలేదు. గత కొన్నిరోజులుగా ప్రతిరోజూ వర్షం కురవడంతో నదులు పొంగిప్రవహిస్తున్నాయి. వడ్డాదిలో పెద్దేరు, విజయరామరాజుపేటలో తాచేరు నది ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వడ్డాదిలో వంతెనపై నీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రిజర్వాయర్ నుంచి వరద నీటిని విడుదల చేయడంతో ఆదివారం ఉదయం చిన్న వంతెనపై కూడా నీరు చేరి సమస్యలు తలెత్తాయి.