బుచ్చియ్యపేట మండలానికి 23 వేల స్మార్ట్ రైస్ కార్డులు
NEWS Sep 14,2025 12:30 pm
బుచ్చయ్యపేట మండలానికి 23000 స్మార్ట్ రైస్ కార్డులు మంజూరయ్యాయని తహసీల్దార్ ఎం. లక్ష్మీ తెలిపారు. సోమవారం తురకలపూడిలో ఎమ్మెల్యే కెఎస్ఎన్ఎస్ రాజు చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేస్తామన్నారు. ఆయా గ్రామాల వారీగా కార్డులు అందిస్తామన్నారు. స్మార్ట్ రైస్ కార్డులో పొరపాట్లు ఉంటే సంబంధిత సచివాలయాలలో సరి చేసుకోవచ్చన్నారు. స్మార్ట్ కార్డులతో తావు లేకుండా రేషన్ పంపిణీ జరుగుతుందన్నారు.