టీటీడీ బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారం
NEWS Sep 14,2025 11:01 am
టీటీడీ బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యుడిగా దేవాదాయశాఖ సెక్రటరీ హరి జవహర్ లాల్, బోర్డు సభ్యులుగా సుదర్శన్ వేణు శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. శ్రీవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అదనపు ఈవో అందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో భాస్కర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.