తిరుమలలో ఈవో ఆకస్మిక తనిఖీ
NEWS Sep 14,2025 10:52 am
ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తిరుమలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. భక్తులకు అందుతున్న సౌకర్యాల గురించి ఆరా తీశారు. క్యూ లైన్ లో భక్తులను, లగేజి కౌంటర్లను పరిశీలించారు. శ్రీకాకుళం, మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతాలకు చెందిన శ్రీవారి సేవకులతో మాట్లాడారు. మరింత నాణ్యమైన శిక్షణ ఇచ్చి తద్వారా భక్తులకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సీపీఆర్వో ను ఆదేశించారు. ఈవో వెంట సీవీఎస్వో మురళీకృష్ణ, డిప్యూటీ ఈవో సోమన్నారాయణ, వీజీవోలు రామ్ కుమార్, సురేంద్ర, హెల్త్ ఆఫీసర్ డా. మధుసూదన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.