తిరుమలను దర్శించుకున్న లోక్ సభ స్పీకర్
NEWS Sep 14,2025 09:56 am
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆదివారం తిరుమలను దర్శించుకున్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఏఈవో వెంకయ్య చౌదరి, జేఈవో వీర బ్రహ్మం తో పాటు ఆచార్యులు, పూజారులు, టీటీడీ బోర్డు సభ్యులు ఘన స్వాగతం పలికారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం స్వామి వారి చిత్ర పటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇదిలా ఉండగా తిరుపతిలో జరిగే మహిళా సాధికారత సదస్సుకు హాజరయ్యారు ఓం బిర్లా.