కేటీఆర్ కామెంట్స్ అద్దంకి సీరియస్
NEWS Sep 14,2025 08:45 am
కేటీఆర్ కు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. 10 ఏళ్లలో 39 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు, 16 మంది ఎమ్మెల్సీలను బీఆర్ఎస్ లో చేర్చుకున్నప్పుడు నీ మొహం ఎటు పోయిందంటూ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి మగాడు, దమ్మున్నోడు కాబట్టే తొడ కొట్టి మిమ్మల్ని ఓడించి ఫామ్ హౌస్ కు పంపించాడని అన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఫైయిల్ అయ్యారని ఆరోపించారు. సుద్దపూస మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని పట్టించు కోరన్నారు.