ఏడాదిలో బందరు పోర్టు సిద్ధం
NEWS Sep 14,2025 08:42 am
మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను పరిశీలించారు ఆర్ అండ్ బి ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కృష్ణ బాబు.ఏడాదిలో బందరు పోర్టు సిద్ధం అవుతుందన్నారు. ఈ పోర్టు రాష్ట్ర అవసరాలు తీర్చడంతో పాటు తెలంగాణ అవసరాలను కూడా తీరుస్తుందని చెప్పారు. మొత్తం 16 బెర్తులను ఏర్పాటు చేస్తున్నామన్నారు .మొదటి దశగా 4 బెర్తులను పూర్తి చేసి కార్యకలాపాలు ప్రారంభిస్తామని తెలిపారు. ప్రస్తుతానికి 50 శాతం మేర పనులు పూర్తి అయ్యాయని వెల్లడించారు.