కొండా సురేఖపై భగ్గుమన్న ఎమ్మెల్యే
NEWS Sep 14,2025 08:39 am
కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మంత్రి కొండా సురేఖపై మండిపడ్డారు. భద్రకాళీ ఆలయ ధర్మకర్తల మండలిలో ఇద్దరు కాదు ఏడుగురిని నియమించుకుంటే ఎలా అని ప్రశ్నించారు. మాకేదో దానం చేసినట్లు నాలుగు పదవులు పడేశారంటూ మండిపడ్డారు. సభ్యులను నియమించేటప్పుడు కనీసం లోకల్ ఎమ్మెల్యే అయిన నాకు చెప్పాల్సిన పని లేదా అని నిలదీశారు. కొండా సురేఖ అబద్దాలు ఆడితే ఎవరికి చెప్పుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.