ఏపీలో రెయిన్స్ ఎఫెక్ట్
NEWS Sep 14,2025 08:32 am
పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాల్లో అల్పపీడనం అనుబంధంగా ద్రోణి విస్తరించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షం కురుస్తుందని జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.