నేడే భారత్, పాకిస్తాన్ కీలక మ్యాచ్
NEWS Sep 14,2025 08:01 am
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ 2025 మెగా టోర్నీలో ఆదివారం కీలకమైన భారత, పాకిస్తాన్ జట్ల మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే టికెట్లు అమ్ముడు పోయాయి. మరో వైపు పహల్గామ్ పై పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన దాడికి నిరసిస్తూ మ్యాచ్ ను రద్దు చేయాలని పెద్ద ఎత్తున కోరుతున్నారు భారతీయులు. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు కేంద్రం. మరో వైపు దాఖలైన పిటిషన్ ను కొట్టివేసింది సుప్రీంకోర్టు. కొన్నేళ్లుగా ఇరు జట్లు తమ తమ దేశాలలో ఆడడం లేదు. కేవలం తటస్థ వేదికగా ఆడుతున్నాయి.